జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మంగళవారం 88వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పరిస్థితిని పరిశీలించి అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.