మాడుగుల: పార్టీ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి

79చూసినవారు
మాడుగుల: పార్టీ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని అనకాపల్లి డి సీ సీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న చెప్పారు. డి సి సి అధ్యక్షునిగా తొలిసారి శనివారం మాడుగుల వచ్చిన ఆయన ఇక్కడ జరిగిన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి మండలంలోనూ పనిచేసే వ్యక్తులతో పార్టీ నిర్మాణం చేపట్టి గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్