నర్సీపట్నoలో ఐదు సంవత్సరాలగా అభివృద్ధి కుంటుపడిందనీ, కూటమి ప్రభుత్వం గెలిచిన 3నెలలకాలంలో మున్సిపాలిటీకి సుమారు 5 కోట్లరూపాయల అభివృద్ధి పనులకు వర్క్ ఆర్డర్లు వచ్చినట్లుస్పీకర్ అయ్యన్నసతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అన్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయామని పేర్కొన్నారు. శనివారం ఆమె మున్సిపల్ కార్యాలయంలో చెత్త వేసేబకెట్లను పారిశుద్ధ్య సిబ్బంది కి పంపిణీచేశారు.