భార్య పై భర్త హత్యాయత్నం

59చూసినవారు
భార్య పై భర్త హత్యాయత్నం
భార్యపై హత్యాయత్నం చేసిన భర్తను ఆదివారం అరెస్టు చేసినట్లు నర్సీపట్నం టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వెలమపేటలో నివసిస్తున్న వెంకట గణేశ్వరరావు రోజు తాగి వచ్చి భార్య సత్యవతిని వేధిస్తుండేవాడు. శనివారం రాత్రి భార్య తలపై చాకుతో దాడి చేశాడు. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అత్త రమణమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్