Mar 18, 2025, 17:03 IST/
జూన్ 30 నాటికి వాట్సాప్లో 500 రకాల పౌరసేవలు: లోకేశ్
Mar 18, 2025, 17:03 IST
AP: మన మిత్ర యాప్ ని ప్రపంచంలోనే చాలా మెరుగ్గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో వాట్సాప్ గవర్నెన్స్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 100 రోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తీసుకొస్తామన్నారు. కేవలం 10 సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని లోకేశ్ అన్నారు.