నాతవరం మండలంలోని గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు నాతవరం ఎంపీడీఓ హనుమంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసమే ఈ సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో కొత్త పనులను గుర్తించేందుకు ఈ సభలు కీలకమని, గుర్తించిన పనులకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు అందరు ఈ సభకు హాజరు కావాలని కోరారు.