విశాఖ: సీటు రాని వారికి స్పాట్ అడ్మిషన్ కల్పించాలి

60చూసినవారు
విశాఖ: సీటు రాని వారికి స్పాట్ అడ్మిషన్ కల్పించాలి
ఎడ్ సెట్ ర్యాంకు సాధించి కన్వీనర్ కోటాలో సీట్లు రానివారికి బీఈడీ స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని‌ విశాఖ జిల్లా ‌ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు. నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏయూ వీసీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బీఈడీ అడ్మిషన్ కోసం రెండవ కౌన్సెలింగ్ నిర్వహించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు స్మార్ట్ అడ్మిషన్స్ జరగలేదన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్