ఈ నెల 20వ తేదీన సాయంత్రం రెండు గంటలు నుండి 7 గంటల వరకు విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న యాదిలో అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజాగాయకుడు దేవిశ్రీ శుక్రవారం తెలిపారు. ఈమేరకు పోస్టర్ ఆవిష్కరించారు. గద్దర్ సాహిత్యం ఈ సమాజం ఉన్నంతకాలం సజీవంగా ఉంటుందన్నారు. గొప్ప పాటలు రాసిన చరిత్ర గద్దర్‌ది అన్నారు. కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ హాజరగుతారని తెలియజేశారు.