వామపక్ష సీపీఎం కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ సీపీఎం పార్టీ మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీహరిపురం వాకింగ్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పైడ్రాజు జోన్ నాయకులు ఆర్. లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. విశాఖ సభలో మోడీ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదన్నారు. నక్కపల్లిలో ప్లాంట్ కు మాత్రం ఆఘమేఘాలమీద ముడి సరుకులు ఇస్తున్నట్లు చెప్పారన్నారు.