ఈనెల 13వ తేదీన భోగి పండగను పురస్కరించుకొని పాడేరు మండలంలోని కాడేలి పంచాయతీలోని గురుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి గిరిజనులు భోగి మంటలు వేశారు. భోగి పండుగ ముందు రోజే సిద్ధం చేసిన కట్టెలను గ్రామంలోని గిరిజనులందరూ భోగి మంటలు వేసి వాటి చుట్టూ కూర్చుని చిన్నపెద్ద అనే తేడా లేకుండా సంతోషంగా చలికాచుకుంటున్నారు. ఇంట్లో ఉన్న అవసరం లేని వస్తువులను భోగిమంటల్లో కాలుస్తూ సందడి చేస్తున్నారు.