మండల కేంద్రమైన నక్కపల్లిలో కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ మాట్లాడుతూ వంగవీటి రంగ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు.