కోటవురట్ల మండలం లింగాపురంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం నాగుల చవితి పండగను సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. కుటుంబాలతో సహా గ్రామ సమీపంలో గల పుట్టల వద్దకు తరలి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. చిమ్మిలి, గుడ్లు, పాలు పుట్టల్లో వేస్తున్నారు. పలువురు పుట్టల వద్దే వంటలు చేసుకుని భోజనాలు చేస్తారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.