రాజకీయాల్లో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారని టీడీపీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు అన్నారు. శనివారం జల్లూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఎదిరించిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.