కోటవురట్ల మండలం కోడవటిపూడి ఎంపీయూపీ స్కూల్ లో గురువారం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంట వేశారు. పాఠశాల ఆవరణలో రంగవల్లులను తీర్చిదిద్దారు. విద్యార్థులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు హరిదాసుల వేషధారణతో అలరించారు.