పీఆర్టీయూ ఎస్ రాయవరం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరు కాలేకపోయిన ఆర్థిక విరాళ దాత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరం అగ్రహారం బయాలజీ ఉపాధ్యాయులు ఆర్ అప్ప నాయుడ్ని పీఆర్టీయూ ఎస్. రాయవరం బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ ఇటువంటి విశాల హృదయం కలిగిన దాతల వలన మాత్రమే ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామని అప్పలనాయుడ్ని ప్రశంసించారు.