ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పరవాడ మండలం పెదముషిడివాడ-విజయరామపురం రహదారిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. శనివారం ఆ రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. చాలాకాలంగా ఈ రహదారి సరిగా లేకపోవడంతో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారని కూటమి నాయకులు తెలిపారు.