ముత్యాలమ్మపాలెం పంచాయతీకి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో గ్రామ సర్పంచ్ భర్త ముత్యాలు తన సొంత లేఅవుట్ లో సీసీ రోడ్లను నిర్మించుకున్నట్లు ఆంధ్ర మత్స్యకార జెఏసీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఏ. అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలన్నారు.