19 మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతి

52చూసినవారు
19 మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతి
సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సబ్బవరం, పరవాడ మండలాల్లో 19 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ బుధవారం తెలిపారు. సబ్బవరంలో ఆయన మాట్లాడుతూ పరవాడ మండలానికి 11, సబ్బవరం మండలానికి 8 దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు. మద్యం షాపులు ఏర్పాటుకు దరఖాస్తు రుసుం రూ. రెండు లక్షలు డిడి తీయాలన్నారు. ఈనెల 11న అనకాపల్లి కలెక్టరేట్ లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్