కాలుష్యాన్ని నియంత్రించాలి

81చూసినవారు
కాలుష్యాన్ని నియంత్రించాలి
పరవాడలో రాంకీ ఫార్మా యాజమాన్యం రసాయనిక వ్యర్థ జలాలను చెరువుల్లోకి విడుదల చేస్తుండడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిఆర్ఓ దయానిధికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా చెరువుల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. చెరువుల్లో నీరు తాగుతున్న పశువులు అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్