సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో మంగళవారం పగల్ పత్తు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం తిరువీధి వేడుకలు జరుగుతాయని ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ తెలిపారు. ఉత్సవాలు సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామిని పుష్పాలు నూతన వస్త్రాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు.