పరవాడ ఫార్మసిటీలో టొరంటో ఫార్మా పరిశ్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు సోమవారం అనకాపల్లి ఆర్డీవో పరిపాలన అధికారి సుధాకర్ కి వినతి పత్రం అందజేసారు. సక్రమమైన మాస్కులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు పి రామకృష్ణ, జే బసవేశ్వర రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు.