ఎస్ రాయవరం: సముద్ర తీరంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

57చూసినవారు
ఎస్ రాయవరం: సముద్ర తీరంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయినట్లు మెరైన్ ఏఎస్ఐ కృష్ణ తెలిపారు. కోరుప్రోలు గ్రామానికి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయనగరం నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు తీరంలో విహారయాత్రకు వెళ్లారు. వారిలో టి అర్జున్, బి. బబ్లు సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు పేర్కొన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్