విశాఖ నగరంలో అన్న క్యాంటీన్ల ప్రారంభం మరోసారి వాయిదా పడినట్లు జీవీఎంసీ అధికారులు బుధవారం తెలిపారు. ముందు ఈనెల 13న అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే విజయవాడలో వరదల కారణంగా ప్రారంభ కార్యక్రమాన్ని ఈనెల 18కి వాయిదా వేశారు. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు క్యాంటీన్లను సిద్ధం చేశారు.