గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్ర బాబును విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించడంపై విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు వి. డాక్టర్ చక్రవర్తి, లీగల్ ప్రతినిధి వర ప్రసాద్ టూ టౌన్ సిఐ తిరుమలరావుకు శనివారం ఫిర్యాదు చేశారు. రౌడీ షీటర్లతో వైసీపీ నాయకులు ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబును ఇబ్బందులకు గురి చేశారన్నారు.