విశాఖ జిల్లా సింహాచలం వరాహాలక్ష్మి నరసింహ స్వామి వారి ఉత్తర ద్వార దర్శన వేడుకలు శుక్రవారం సాదాసీదాగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ఏర్పాట్లు చేయగా. ఆశించినంత మేర భక్తులు రాకపోవడంతో కళ తప్పింది. క్యూ లైన్లు ఖాళీగా కనిపించాయి. దీనికి గల కారణాలు అధికారులు అన్వేషిస్తున్నారు. ఎప్పడూ ఉత్తర ద్వారా దర్శనంకు భక్తులు పోటెత్తుతారు. ఈసారి మాత్రం నామమాత్రంగా రావడం గమనార్హం.