విశాఖ నగరంలో వీధి విక్రయదారులు, ఆహార సరఫరాదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్. సోమన్నారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ తో కలిసి వ్యాపారులతో సమావేశమయ్యారు.