జాతీయ యువజన ఉత్సవాలు ప్రజాతంత్ర 2024కు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయానికి చెందిన ఎం. శివాని లహరి, డి. హర్షిత ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. వచ్చేనెల 16 నుంచి నవంబర్ 18 వరకు లక్నోలో జరిగే యువజన ఉత్సవాలలో వీరిరువురు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఎయుకు చెందిన ఎం శివాని లహరి, డి హర్షిత ఎంపిక కావడంపై విసి ఆచార్య జి. శశిభూషణరావు గురువారం అభినందించారు.