మధురవాడలో ఓ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. 29 ఏళ్ల పి. సాయికుమార్, అప్పుల ఒత్తిడితో మానసికంగా కష్టపడుతున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన సాయంత్రం తల్లికి చనిపోతున్నాను అని మెసేజ్ చేసిన తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కుటుంబ సభ్యులు, పోలీసుల సహాయంతో రాత్రి 8 గంటల సమయంలో పురుగుల మందు తాగినట్లు గుర్తించి, చికిత్స కోసం కె జీహెచ్ కు తరలించారు.