విశాఖలో డిసెంబర్ 14న ప్రముఖ సినీ నటి శ్రీలాల చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో షాపింగ్ మాల్‌కు ఇసుక వేస్తే రాలనంత జనం తరలివస్తున్నారు. కేవలం రూ. 99లకే కాంబో ఆఫర్ ప్రకటించడంతో జనం బారులు తీరుతున్నారు. విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి వస్త్ర ప్రేమికులు భారీగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు.