
ఉమ్మడి విశాఖ జిల్లా వాసులకు అలర్ట్
రాష్ట్రంలో 110 మండలాల్లో రేపు తీవ్రమైన వేడి గాలులు ఉండనున్నాయి. కోనసీమ జిల్లాలోని 7 మండలాలు, కాకినాడలోని 3, తూ.గో లో ఒక మండలం, మరో 98 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.