ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో గాయత్రి సదనంలో డిక్లరేషన్‌పై అన్నా లెజినోవా సంతకం చేశారు. అలాగే ఈ రాత్రి అన్నా లెజినోవా తిరుమలలోనే బస చేయనున్నారు. మార్క్ శంకర్ కోలుకున్న నేపథ్యంలో అన్నా లెజినోవా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.