పశ్చిమలో సీపీఐ ప్రచారం
విశాఖ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల విజయాన్ని కాంక్షిస్తూ పారిశ్రామిక ప్రాంతం, గోపాలపట్నం, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో ఇండియా కూటమి ప్రతినిధులు మంగళవారం ప్రచారం నిర్వహించారు. అత్తిలి విమలకు ఒక్క అవకాశం కల్పించాలని ఇంటింటా ప్రచారం చేశారు. పరిశ్రమల మనుగడకు వామపక్ష కూటమి అభ్యర్థుల విజయం అనివార్యమని పేర్కొన్నారు.