విశాఖలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలైన జెమీమాపై మరో కొత్త కేసు నమోదైంది. ఓ బాధితుడు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ, జెమీమా తనను నిర్బంధించి, చంపేందుకు యత్నించిందని ఆరోపించారు. అలాగే, జెమీమా, వేణురెడ్డితో కలిసి డెబిట్ కార్డు నుంచి లక్షలు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ జెమీమాపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.