అచ్యుతాపురం: 26న ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలి

77చూసినవారు
అచ్యుతాపురం: 26న ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలి
పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం అచ్యుతాపురం మండలం పెదపాడు గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్