ప్రతిభ వంతులైన క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని వారి ప్రతిభకు వెలికి తీసి జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా రాణించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షులు బొదేపు గోవింద్ అన్నారు. మంగళవారం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా సెలక్షన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక, యలమంచిలి మండలాల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ గ్రామీణ యువతి యువకులు క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి సీఎం కప్ టోర్నమెంట్ ను నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేసిందని చెప్పారు. విద్యకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తున్నట్లే క్రీడలకు అంత ప్రోత్సాహం కల్పిస్తుందని అన్నారు.
కబడ్డీ వాలీబాల్ క్రికెట్ సెలక్షన్ ఆయన స్వయంగా పరిశీలించారు. నాలుగు మండలాల నుండి యువకులు తమ ప్రతిభను పరీక్షించుకోగా కబాడీ వాలీబాల్ నుండి 12 చొప్పున క్రికెట్ 15 మంది చొప్పున జిల్లా టీమ్లను సెలెక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ వైయస్సార్ పార్టీ నాయకులు బద్ధపు ఎర్రయ్య దొర, శేఖర్, పిట్ట సత్తిబాబు, వ్యాయము ఉపాధ్యాయులు షబ్బీర్, చందర్రావు, అప్పలరాజు, గోవిందు, నియోజకవర్గ ఇన్చార్జ్ పి డి ఏ ఏ ఎన్ మూర్తి, శాప్ కోచ్ రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.