యలమంచిలి: గంజాయి తాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
యలమంచిలి: గంజాయి తాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
గంజాయి తాగే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మంగళవారం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. అదే ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో యువత గంజాయికి ఎక్కువగా అలవాటు పడడం ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్నారు.

సంబంధిత పోస్ట్