యలమంచిలి: ఘనంగా గోదాదేవి పాశురం కార్యక్రమాలు

69చూసినవారు
ధనుర్మాసం సందర్భంగా నెలరోజులపాటు ఆలయాల్లో గోదాదేవి పాశురం భక్తిశ్రద్ధలతో మహిళలు పఠనం చేస్తుంటారు. డిశంబర్ 15వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు దేవాలయాల్లో నిర్వహిస్తారు. దానిలో భాగంగా మంగళవారం అనకాపల్లి జిల్లా యలమంచిలి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మహిళలు 23వ పాశురము కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో పఠించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్ర చామంతి పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్