దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మోర్చ ఆధ్వర్యంలో నవంబర్ 26న దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో జరుగు ప్రదర్శన, సభలను జయప్రదం చేయాలని ఆదివారం యలమంచిలి సిఐటియు కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు, మండల కార్యదర్శి సిహెచ్ శివాజీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రె అప్పారావు పిలుపునిచ్చారు. కనీస వేతన 26000 ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో జరుగు ప్రదర్శన సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.