యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ధర్మవరంకి చెందిన గొన్నాబత్తుల గణేష్ (28) బ్రెయిన్ స్ట్రోక్ వలన పక్షవాతంతో బాధపడుతున్న ఇతనికి చికిత్స నిమిత్తం మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మురుకుర్తి గోపి, ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పండూరి సురేష్ ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం 25000/- చెక్కును ఆదివారం యలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు చేతుల మీద గణేష్ వాళ్ళ అమ్మగారికి అందజేశారు.