అనకాపల్లి జిల్లా పరిది నర్సీపట్నం, రేగుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య బుదవారం గుర్తు తెలియని రైలుబండి ఢీ కొనడంతో యలమంచిలి మండలం పేట బయ్యవరం గ్రామానికి చెందిన అన్నం వరప్రసాద్ (18) అనే యువకుడు మృతి చెందినట్టు తుని రైల్వే ఎస్ఐ జి. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడు బహిర్భూమికని రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.