ప్రజాస్వామ్యంపై ఓటర్లు విశ్వాసం కలిగి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని శనివారం దేశ రాజధాని దిల్లీలో ముర్ము ప్రసంగించారు. వివేకం కలిగిన ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తారని వ్యాఖ్యానించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు సంకుచిత మనస్తత్వం, వివక్ష, ప్రలోభాలకు అతీతంగా దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలని సూచించారు.