AP: టీడీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రోజా కామెంట్స్‌కు కౌంటర్ విసిరారు. పెళ్లిళ్లు, పేరంటాలు, ఓట్లు కోసమో చంద్రబాబు దావోస్ వెళ్లలేదని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లాలనుకుంటే చంద్రబాబు తీసుకుని వెళ్లేవారని స్పష్టం చేశారు. వైసీపీ లీడర్లు అందరూ కామాంధులు, రౌడీలు, భూకబ్జాదారులని ఒళ్లు తెలియకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.