జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన లోకేశ్

81చూసినవారు
జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన లోకేశ్
భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ ట్వీట్ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానవని అభివర్ణించారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్