అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నాం: సీఎం చంద్రబాబు

60చూసినవారు
అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నాం: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పనిగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. తాము పడిన శ్రమను జగన్ వృథా చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తున్నామని, వారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేయొచ్చో నిపుణులే చెప్పాల్సి ఉందన్నారు. ఇటీవల ప్రాజెక్టును చూసి కళ్ల వెంట నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్