ఒకప్పుడు ఏపీ మోడల్ స్టేట్‌గా ఉండేదని, గత ఐదేళ్లలో ఎలా ఉండకూడదనే దానికి నిదర్శనంగా నిలిచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. అందరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. వ్యవస్థలను బతికించాలనే అన్నీ తట్టుకుని నిలబడ్డాం.’ అని పవన్ అన్నారు.