వైఎస్ జగన్ YCP పార్టీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ. ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనం జమిలి ఎన్నికలకు సన్నద్ధంగా ఉంటాం. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూసి ఉండం. నేను ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. నాలుగు నెల్లలోనే ఈ ప్రభుత్వం వద్దంటూ ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది' అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.