పెద్ద ఎత్తున ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ సెక్టార్ పాలసీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగంలో రూ.84 వేల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీనికి ఉప రంగాలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్స్, ఏసీ తయారీ, 5జీ కమ్యూనికేషన్ అభివృద్ధి పైనా దృష్టి పెట్టనుంది. వ్యాపారంలో వేగం, 12 గంటల పని షిప్టులు, వాక్ టూ వర్క్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ఇవ్వనుంది.