రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం: మంత్రి

81చూసినవారు
రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం: మంత్రి
AP: అమరావతి డెవలప్‌మెంట్ బాధ్యతను తనపై ఉంచారని, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా అహర్నిశలు శ్రమిస్తానని మంత్రి నారాయణ అన్నారు. "అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతాం. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయి.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మున్సిపాలిటీల అభివృద్ధి, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తాం." అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్