రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపుతాం: సీఎం చంద్రబాబు

63చూసినవారు
రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపుతాం: సీఎం చంద్రబాబు
రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపుతామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేమకల్లులో సీఎం మాట్లాడుతూ.. "అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటాం. హంద్రీనీవాపై రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది" అని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్