వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అయితే తాము వైసీపీని వీడనున్నారనే ప్రచారాన్ని ఎంపీలు కృష్ణయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఖండించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని చంద్రబోస్ చెప్పారు. బీసీల కోసం పోరాడేందుకు తనను రాజ్యసభకు పంపిన జగన్‌ను వదిలేదే లేదని కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అధికారం కోసం పార్టీ మారబోమని ఆళ్ల తెలిపారు.